‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్ కొట్టి స్టార్ స్టేటస్‌ని తెచ్చుకున్న హీరో నాని. తన సహజమైన నటన, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ యువహీరో ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అందాల రాక్షసి సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అరకు ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‍లో పలు కీలక సన్నివేశాలతో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విశాల్ శేఖర్ చంద్ర సంగీతంలో రూపొందిన ఆడియో ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఫస్ట్‌లుక్‌తో పాటే సినిమా టైటిల్‌నూ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. నాని ఈ సినిమాలో బాలకృష్ణ అభిమాని పాత్రలో కనిపించడం విశేషం. More

0 Komentar